Jigris | మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేం రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. రోడ్ ట్రిప్ – ఫ్రెండ్ షిప్ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించాడు. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మించారు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2025 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
యూత్ ఫుల్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తన లక్‌ను పరీక్షించుకునేందుకు జిగ్రీస్ ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. జిగ్రీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం సన్ నెక్ట్స్‌లోకి జనవరి 6న (నేడు) ఎంట్రీ ఇచ్చింది. జిగ్రీస్ మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ఈశ్వరదిత్యా సినిమాటోగ్రాఫర్ కాగా.. కమ్రాన్ సయ్యద్ మ్యూజిక్ అందించాడు.
నలుగురు స్నేహితులు ఇన్ టూ ది వైల్డ్ (Into the Wild) అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూసి స్ఫూర్తి పొంది, ఫోన్లు, డబ్బులు, ఐడెంటిటీ కార్డులు లేకుండా గోవాకు ప్రయాణమవుతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సరదా, కష్టాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇంకేంటి థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ సినిమాపై మీరూ ఓ లుక్కేయండి.
#JIGRIS (Telugu)
Now streaming on Sunnxt 🍿!!#OTT_Trackers pic.twitter.com/Por0jjPJYB
— OTT Trackers (@OTT_Trackers) January 6, 2026
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?