రామవరం, జనవరి 06 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే గెస్ట్ హౌస్ వద్ద కాపర్ వైర్‌ను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఎస్ అండ్ పిసి సిబ్బంది అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మాయాబజార్‌కు చెందిన ఈ ముగ్గురు కాపర్ వైర్‌ను దొంగలించి మాయాబజార్ ప్రాంతంలో దానిని దహనం చేసి రాగిని వేరుచేయడానికి యత్నిస్తుండగా సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సింగరేణి ఎస్ అండ్ పిసి సిబ్బంది దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.