Bomb threat : ఈ మధ్య కాలంలో ‘విమానంలో బాంబులు పెట్టాం, రైల్లో బాంబులు పెట్టాం, స్కూళ్లో బాంబులు పెట్టాం, ప్రభుత్వ కార్యాలయంలో బాంబులు పెట్టాం’ అని బెదిరించడం సర్వసాధారణంగా మారిపోయింది. తరచూ ఈ మెయిల్లు ద్వారా, ఫోన్ల ద్వారా ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
తాజాగా అలాంటి బెదిరింపు మెయిలే మరోటి వెలుగులోకి వచ్చింది. కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన అధికారులు కాశీ ఎక్స్‌ప్రెస్ రైలును మవూ రైల్వేస్టేషన్లో నిలిపేసి తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, జీఆర్పీ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.
చివరికి ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బెదిరింపు మెయిల్‌తో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఆకతాయిని గుర్తించే పనిలోపడ్డారు.
#WATCH | Mau, UP: The Kashi Express Train received a bomb threat. Police, RPF, and GRP teams are conducting the investigation at Mau railway station. pic.twitter.com/qA2hweph00
— ANI (@ANI) January 6, 2026