Pakistan Lobbying: ఆపరేషన్ సింధూర్ వేళ.. అమెరికాలో పాకిస్థాన్ లాబీయింగ్
Pakistan Lobbying: భారత దళాల దూకుడును అడ్డుకునేందుకు అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. దీని కోసం ఆ దేశం తీవ్రంగా ల్యాబీయింగ్ చేసినట్లు తాజా ఆధారాలు బయటపడ్డాయి. వాషింగ్టన్లో సుమారు 60 సార్లు పాక్ అధికారులు మీటింగ్ పెట్టారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ రక్షణ దళాల దూకుడును అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. దీని కోసం ఆ దేశం తీవ్రంగా ల్యాబీయింగ్(Pakistan Lobbying) చేసినట్లు తాజా ఆధారాలు బయటపడ్డాయి. వాషింగ్టన్లో అమెరికా పెద్దలను కలిసేందుకు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నం చేసింది. దౌత్యపరమైన రీతిలో అమెరికా సహాయాన్ని కోరింది. పాకిస్థానీ దౌత్యవేత్తలు, రక్షణ దళ అధికారులు ఇండియాను శాంతింపచేయడానికి అమెరికా హెల్ప్ కోరారు. సుమారు 50 సార్లు మీటింగ్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ చేపట్టే విధంగా పాకిస్థాన్ అధికారులు అమెరికాను వేడుకున్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని రాసింది. దానికి సంబంధించిన డాక్క్యూమెంట్లను కూడా ఆ కథనంలో సమీక్షించారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతీయ సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్టులో దాఖలైన రికార్డుల ఆధారంగా పాకిస్తాన్ అధికారులు సుమారు 60 సార్లు అమెరికా అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తున్నది. పాకిస్థాన్ అంబాసిడర్తో పాటు రక్షణాధికారులు ఈ-మెయిల్, ఫోన్లు, వ్యక్తిగతంగా అమెరికా అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. భారత్ తన దాడిని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అమెరికాను పాక్ కోరినట్లు ఆ డాక్యుమెంట్లతో తెలిసింది. అమెరికా ఉభయసభలు, పెంటగాన్, జర్నలిస్టులను పాక్ అధికారులు కలిశారు. కశ్మీర్, ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక బంధాలు,మీడియా సంస్థలతో పాక్ చర్చించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో లాబీయింగ్ కోసం పాకిస్థాన్ ఎక్కువగా ఖర్చు చేసినట్లు తెలిసింది. ఆరు లాబీయింగ్ సంస్థలతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా కథనంలో రాశారు. సీడెన్ లా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్మార్షల్ అసిమ్ మునీర్తో ట్రంప్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
తాము వాణిజ్య బెదిరింపులకు పాల్పడితేనే ఆపరేషన్ సింధూర్ను ఇండియా ఆపినట్లు ట్రంప్ పలుమార్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

