హైదరాబాద్: తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్ గొంగిడి సునీత, ఇతర నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టి హారతిపట్టారు. మాజీ మంత్రి సత్యవతి.. అక్షింతలు వేసి కేటీఆర్‌ను ఆశీర్వదించారు.