Abhishek Manu Singhvi : కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతరాదిత్య సింధియా, కామాఖ్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, రాజేభోస్లే, బిప్లవ్ కుమార్ దేవ్, మీసా భారతి, దీపేంద్రసింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. దాంతో వారు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అదేవిధంగా ఒడిశాలో మమతా మొహంత, తెలంగాణలో కే కేశవరావు తమ పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేశారు.
దాంతో దేశవ్యాప్తంగా మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్విని రంగంలోకి దించారు. దాంతో ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లారు.
అక్కడ తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సింఘ్వికి స్వాగతం పలికారు. ఆయన మెడలో పూలమాల వేసి, కాంగ్రెస్ కండువా కప్పి సత్కరించారు.
#WATCH | Hyderabad | Congress nominee for Rajya Sabha bypoll from Telangana, Abhishek Manu Singhvi arrives at Telangana Assembly, ahead of filing nomination today pic.twitter.com/oujLtHsn64
— ANI (@ANI) August 19, 2024