Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని మొదట 2024 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా తేదీని కూడా ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే రోజున కోలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. తమిళ స్టార్ నటుడు సూర్య – శివ కాంబోలో కంగువ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇదే రోజున ఇప్పుడు రజినీకాంత్ వేటగాడు కూడా రాబోతుంది. దీంతో దసరా రోజు బిగ్ ఫైట్ జరుగనున్నట్లు తెలుస్తుంది.
Target locked 🎯 VETTAIYAN 🕶️ is set to hunt in cinemas worldwide from OCTOBER 10th, 2024! 🗓️ Superstar 🌟 as Supercop! 🦅
Releasing in Tamil, Telugu, Hindi & Kannada!#Vettaiyan 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/WJi2ZvpX8Z
— Lyca Productions (@LycaProductions) August 19, 2024
Also read..