మంథని రూరల్, డిసెంబర్ 23 : పెద్దపల్లి జిల్లా మంథని, మల్హర్ మండలాల మధ్య మానేరు నదిలోని చెక్‌డ్యామ్ నిర్మాణంపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. మంగళవారం మంథని మండలం అడవిసోమన్‌పల్లి వద్ద కూలిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు.
వేములవాడ, డిసెంబర్ 23 : ‘దేశ ప్రజలు మూడుసార్లు రాహుల్‌గాంధీ తోలుతీసి ఆరేసినా మీకు సిగ్గు రాలేదా?. అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై ఆది చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజాసేవలో ఉన్న గొప్ప నాయకుడిని పట్టుకుని ‘ప్రజలు తోలు వొలిచారని ఎలా మాట్లాడతారు?’ అంటూ మండిపడ్డారు. ‘మీరు నాలుగుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజలు మీ తోలు తీసి ఆరేసినా సిగ్గు రాలేదా?’ అని ఎద్దేవా చేశారు.