రామగిరి, ఫిబ్రవరి 28 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిని శనివారం యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌కు పూలబొకెలు అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేశ్ స్వేరో, ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, పీడీఎస్‌యూ యూనివర్సిటీ అధ్యక్షుడు హర్ష, వర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, టీఆర్వీఎస్ అధ్యక్షుడు పాక రవి, డీఎస్‌యూ అధ్యక్షుడు నిర్సనమెట్ల సుధీర్ మహారాజ్, నాయకులు సతీశ్, శివ, నరసింహ పాల్గొన్నారు.