నల్లగొండ రూరల్, జూలై 29 : గురు పూర్ణిమ సందర్భంగా నిత్య యోగా సాధకుల ఆధ్వర్యంలో నల్లగొండ బీజేపీ కార్యాలయంలో గత ఎనిమిదేండ్లుగా ఉచితంగా నిత్య యోగ సాధనను అందిస్తూ వందలాది మందికి ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న ప్రముఖ యోగా గురువు రాపోలు వెంకటేశ్వర్లును శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు మాట్లాడుతూ.. యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మార్చేందుకు గురువు రాపోలు వెంకటేశ్వర్లు గత 8 ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతిరోజూ ఉచితంగా యోగా శిక్షణ అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన సేవలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ ఇన్స్ట్రక్టర్ నరేందర్, పిల్లి రామరాజు, చింత శివరామకృష్ణ, వనమ శ్రవణ్, గార్లపాటి శేఖర్, పోగుల రమేష్, కారింగు శ్రీనివాస్, ఆర్.ఆకాష్, రామలింగయ్య, వెంకట్ రెడ్డి, ప్రకాష్, కారింగు వెంకన్న, కుషల్ పాల్గొన్నారు.