చిగురుమామిడి : బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ( Peddi Sudarshan Reddy ) కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు( Captain Kantarao ) , హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ బుధవారం యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
మూడు రోజుల క్రితం గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. అనంతరం అతని భార్య స్వప్న తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాల అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి మనోధైర్యం నింపారు. పెద్ది త్వరగా కోలుకుంటారని పేర్కొన్నారు. యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు కోరారు.