CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సిగ్మా’ (Sigma). ఈ సినిమా స్పెషల్ షోను తిలకించేందుకు సీఎం విజయ్ సతీమణి సంగీత చెన్నైలోని ప్రముఖ కమల్ థియేటర్(Kamal Theatre)కు విచ్చేశారు.
విజయ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో గత కొంతకాలంగా ఆమె మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అవేవీ పట్టించుకోకుండా, ఎట్టకేలకు తన కొడుకు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాన్ని ఆదరించేందుకు ఆమె బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. థియేటర్లో ఆమె ప్రత్యక్షమవ్వడంతో అక్కడి మీడియా కెమెరాల కంటపడ్డారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వార్తలు కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.