Captain Smit Machchhar: కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర !
Captain Smit Machchhar: ధైర్యసాహసాలు ప్రదర్శించిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డుతో సత్కరించే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా.. ఆ కుట్రను భగ్నం చేసిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డు వరించే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్(Captain Smit Machchhar)ను అశోక చక్ర అవార్డుతో సత్కరించే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా.. ఆ కుట్రను భగ్నం చేసిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డు వరించే అవకాశాలు ఉన్నాయి. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే వారిని అశోక చక్ర అవార్డుతో సన్మానించే విషయం తెలిసిందే. సుమారు 180 మంది ప్రాణాలను కాపాడిన మచ్చర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ కూడా ఆ పైలట్‌ను ఓ హీరోగా కీర్తించారు.
గుజరాతీ మూలాలు ఉన్న ఆ పైలట్‌కు ఇప్పటికే గుజరాతీ సర్కారు విశిష్ట్ గుజరాత్ గిరిమా అవార్డును ప్రకటించింది. అతని ధైర్యసాహసాలను మెచ్చుకున్నది. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. మచ్చర్ త్వరగా కోలుకోవాలని కాశీ విశ్వనాథ్ ఆలయంలో కూడా పూజలు చేశారు. ఒకవేళ మచ్చర్‌కు అశోక చక్ర ప్రదానం చేస్తే, అప్పుడు ఆ అవార్డును గెలుచుకున్న రెండో ఏవియేషన్ వ్యక్తిగా ఆయన నిలుస్తారు. 1987లో పాన్ ఆమ ఫ్లయిట్ 73లో సీనియర్ ఫ్లయిట్ పర్సర్‌గా చేసిన నీరజ్ భానోత్‌కు గతంలో అశోక చక్ర ఇచ్చారు. హైజాక్ అయిన ఫ్లయిట్‌లోని ప్రయాణికుల్ని రక్షించిన ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారు. ప్రస్తుతం మచ్చర్ కూడా తెగువ చూపించినట్లు ప్రశంసంలు అందుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

