Bethlehem Kudumba Unit | మలయాళంలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు సృష్టించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రేమమ్ ఫేమ్ నివిన్ పౌలీ, ప్రేమలు బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ. డి దర్శకత్వం వహించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఆస్వాదించవచ్చు.