IPS Trainee | తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో మంగళవారం అదుపులోకి తీసుకుని ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు అప్పగించారని తెలిసిందే. కాగా ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయ్‌కృష్ణారెడ్డిని బుధవారం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరపరుచగా.. న్యాయమూర్తి అతడికి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని పలోఈసులు భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఐపీఎస్ ట్రైనీ మహిళపై దాడి నిజమే..
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్‌కృష్ణారెడ్డి దాడి చేసినట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయినట్టు తెలిసింది. కేసు నమోదైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెపై భౌతికంగా దాడి జరిగినట్టు తేల్చారు. బాధితురాలి గొంతు నులిమినట్టు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కొట్టిన కమిలిన గాయా లు, ఎడమ కాలిపైనా గాయం ఉన్నట్టు సమాచారం.
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు