Kakinada Blast | కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది మృతి..?
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఘటనా స్తలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద స్థలంలో ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇది స్తానికుల నుంచి అందిన ప్రాథమిక సమచారం. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడ్డాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో అక్కడ 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా పేలుడు కొనసాగుతోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన అని ప్రాథమిక అంచనా.
స్థానిక పెదపూడి రోడ్డులోని పొలాల్లో అడపా నాని కుటుంబ సభ్యులు ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అక్కడే ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

