Stree 2 | బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబో రిలీజైన సీక్వెల్ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ఈ ప్రాజెక్ట్ ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించి ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
తాజాగా మరో అరుదైన మార్క్‌తో వార్తల్లో నిలిచింది. 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇప్పటివరకు రూ.204 కోట్లు రాబట్టింది. నేడు రక్షాబంధన్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓ వైపు వేదా, మరోవైపు ఖేల్ ఖేల్ మే చిత్రాలున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో స్క్రీనింగ్ అవుతోంది. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే రెండో వారం ముగిసే లోపు రూ.400 కోట్ల క్లబ్‌లోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
. ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయని చెప్పాలి. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
Call it a STORM or a TSUNAMI or a TYPHOON… #Stree2 records a SENSATIONAL extended weekend… The two major #Hindi films that released alongside it [#KhelKhelMein, #Vedaa] were severely impacted by the #Stree2 wave.#Stree2 has hit a DOUBLE CENTURY [₹ 200 cr NBOC] in just *4… pic.twitter.com/C5PtOHqUoI
— taran adarsh (@taran_adarsh) August 19, 2024
Vettaiyan Movie | దసరా బరిలో ‘వెట్టయాన్’ .. సూర్య ‘కంగువ’కు పోటిగా తలైవర్