Softball Competitions | జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లోని శ్రీ చైతన్య హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న షోయబ్ సెలెక్ట్ అయ్యాడు. ఇటీవల మెదక్ జిల్లాలో నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హరియాణా రాష్ట్రం జజ్జార్లోని సంస్కారం యూనివర్సిటీలో జరిగబోయే జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున షోయబ్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు శ్రీచైతన్య పాఠశాల కరస్పాండెంట్ క్యాతం గంగారెడ్డి తెలిపారు. ఈ ఎంపిక పట్ల షోయబ్ తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.