Gold Jewellery | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్ (Jewellery Shop)కు వెళ్లిన మహిళలు చేతివాటం ప్రదర్శించారు. నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను (Gold Jewellery) చోరీ చేశారు.
ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్ (Kalyan Jewellers showroom)లో ఈ ఘటన జరిగింది. ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు అక్కడ సిబ్బంది కళ్లుగప్పి చోరీకి పాల్పడ్డారు. సేల్స్‌మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో గాజు షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిముగించుకుని ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
అయితే, డిస్ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేయగా.. ఈ చోరీ వ్యవహారం బయటపడింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు దొంగలించిన బంగారం విలువ రూ.14లక్షలు అని అంచనా.
Women stole ₹14 lakh jewelry from Kalyan Jewellers in Prayagraj. – They distracted the salesman, hid gold earrings in their shawls and escaped in 14 minutes. – The entire theft was captured on CCTV cameras.#kalyanjwellers #prayagraj #CCTV #gnwnews pic.twitter.com/XaN8auYp2H
— GNW News ⚡ Genuine National Window (@gnwnews_a) January 7, 2026
Also Read..
Bald Head | ఈ బట్టతల భర్త నాకొద్దు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
Demolition Drive: మసీదు వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఢిల్లీలో గాయపడ్డ అయిదుగురు పోలీసులు
Karnataka: మహిళా కార్యకర్తపై దాడి చేసి దుస్తులు చింపేశారు.. కర్నాటక పోలీసుల దూకుడు