న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ సమీపంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు వద్ద నిర్మాణాలను తొలగిస్తున్న(Demolition Drive) సమయంలో హింస చోటుచేసుకున్నది. కూల్చివేతలను అడ్డుకుంటూ కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేత ప్రదేశంలో గుంపును చెదరొట్టేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్లు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో చెప్పారు. ఈ ఆపరేషన్ సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో సైట్ వద్ద గందరగోళం ఏర్పడింది. అయితే భద్రతా సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
జనవరి ఆరో తేదీ రాత్రి నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టినట్లు డీసీపీ నిధిన్ వాల్సన్ తెలిపారు. డెమోలిషన్ సిబ్బంది సైట్ వద్ద ఉన్న సమయంలో సుమారు 150 మంది అక్కడకు చేరుకున్నారు. ఎంసీడీ మెషీన్లు, జేసీబీలతో కూల్చివేత చేపట్టారు. రాళ్ల దాడిలో గాయపడ్డ పోలీసులకు చికిత్స అందిస్తున్నారు. మెడికల్ నివేదిక వచ్చిన తర్వాత లీగల్ చర్యలు చేపట్టనున్నట్లు డీసీపీ వెల్లడించారు. సీసీటీవీ ఫూటేజ్‌ను విశ్లేషిస్తున్నామన్నారు.
మసీదు వద్ద బాంకెట్ హాల్, డిస్పెన్సరీ అక్రమంగా నిర్మించినట్లు ఎంసీడీ అధికారులు చెప్పారు. ఆ నిర్మాణాలను చట్టవ్యతిరేకమని కూడా కోర్టు చెప్పింది. అయితే డ్రైవ్ సమయంలో ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
VIDEO | Delhi: MCD carries out demolition drive near Faiz-e-Elahi Masjid at Turkman Gate against illegal encroachment. Latest visuals from the spot.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#Delhi pic.twitter.com/CyYAX9VsR8
— Press Trust of India (@PTI_News) January 7, 2026