Sushmita Konidela | బాబాయ్‌లా కాదు బ్రదర్‌లా ఉండేవారు .. పవన్ కళ్యాణ్‌పై సుస్మిత కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు
Sushmita Konidela | మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మొదట ఫ్యాషన్ డిజైనర్‌గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు. ఇటీవల చిరంజీవిని హీరోగా రూపొందించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
Sushmita Konidela | మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మొదట ఫ్యాషన్ డిజైనర్‌గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు. ఇటీవల చిరంజీవిని హీరోగా రూపొందించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో సుస్మిత నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల ఒక టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుస్మిత కొణిదెల తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
సుస్మిత మాట్లాడుతూ… ఆయన నాకు కేవలం బాబాయ్ మాత్రమే కాదు, ఒక బ్రదర్‌లా కూడా ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సరదాగా గడిపాం. మా ఇంట్లో పిల్లలందరితో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అని చెప్పారు. అంతేకాకుండా హాలీవుడ్ సినిమాలంటే తమకు ఆసక్తి కలిగేలా చేసినది కూడా పవన్ కళ్యాణ్‌నే అని ఆమె తెలిపారు బాబాయ్ దగ్గర చాలా హాలీవుడ్ సినిమాలు ఉండేవి. ముఖ్యంగా ది గాడ్ ఫాదర్, స్టార్ వార్స్ లాంటి సినిమాలను ఆయనే మాకు పరిచయం చేశారు. అప్పట్లో ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఆయనే మాకు వినిపించేవారు. అలా మాకు కొత్త ప్రపంచాన్ని చూపించారు” అని సుస్మిత గుర్తుచేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో బాబాయ్ నన్ను,రామ్‌చరణ్‌ను, ఇంట్లో ఉన్న పిల్లలందర్నీ కూర్చోబెట్టి హారర్ కథలు చెప్పేవారు. నాకు హారర్ కథలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆసక్తిగా వింటూ ఉండేదాన్ని. కానీ మిగతా పిల్లలు మాత్రం ఆ కథలకు భయపడి మధ్యలోనే వెళ్లిపోయేవారు అని ఆమె నవ్వుతూ చెప్పారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకత గురించి కూడా సుస్మిత ప్రస్తావించారు. బాబాయ్ ఏ డ్రెస్ వేసుకున్నా అది వెంటనే ట్రెండ్ అవుతుంది. ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఆయనలో ఉన్న మరో కోణం మాత్రం చాలా మందికి తెలియదు. ఆయనలో ఆధ్యాత్మికత, తాత్వికత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాలు మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి అని తెలిపారు. సుస్మిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి చెప్పిన ఈ విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నప్పటి జ్ఞాపకాల గురించి ఆమె చెప్పిన మాటలు మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

