రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ హోటల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
అయినప్పటికీ కారు డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక బైక్ను దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. పలువురు స్థానికులు వెంబడించి కారును ఆపారు. అందులో నుంచి డ్రైవర్ను బయటకు తీయగా మందు మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం
మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహ్ఫిల్ హోటల్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి, పలు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన స్కోడా కారు
అనంతరం కారు కింద చిక్కుకున్న ఒక బైకును దాదాపు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
కారును వెంబడించి పట్టుకొని,… pic.twitter.com/cO6XPHS0dd
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2026