బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో బీజేపీ మహిళా కార్యకర్తపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఆమెపై దాడి చేసి దుస్తులు చింపేశారు. ఈ ఘటన హుబ్లీలో జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్నారు. కేశ్వాపూర్ రాణాలో చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టిన బీజేపీని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆ టైంలో ఓ బీజేపీ కార్యకర్త దాన్ని అడ్డుకున్నది. అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరగబడ్డ ఆ కార్యకర్తపై దాడి చేశారు. ఆ పెనుగులాటలో ఆమె దుస్తులు చినిగిపోయాయి. ఆ మహిళా కార్యకర్త గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. ఇటీవల ఆమె బీజేపీలో చేరింది. ఓటర్ల జాబితా నుంచి కొందరి పేర్లను తొలగించే అంశంలో అధికారులకు ఆ మహిళ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తమ ప్రవర్తనపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉన్నది. ఈ ఘటన తర్వాత అక్కడ రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి.
Is this how a woman is treated? Allegations of assault after forcibly stripping her clothes!The victim has been identified as Sujatha https://t.co/7BkA7O471M this not an inhuman act? Honorable @DrParameshwara what do you have to say about this? Hubballi Keshwapur PoliceStation. pic.twitter.com/Un0W3J4CW5
— Smt. Kanthi Shetty (@ShettyKanthi) January 7, 2026