రాజేంద్రనగర్ : హైదరాబాద్ శివారులో మినీ లారీ బోల్తా పడింది. శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ మినీ లారీ టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
బుధవారం ఉదయం ఆరాంఘర్ నుంచి ఇటుక లోడ్‌తో వెళ్తున్న మినీ లారీ శివరాంపల్లి వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 289 వద్దకు రాగానే టైరు పేలి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వెనుకాల ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ బోల్తా పడటంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు రోడ్డుపై పడిన ఇటుకలను, జీహెచ్ఎంసీకి సంబంధించిన జేసీబీ సాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. లారీ బోల్తాపడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది.