KTR | ఖమ్మం రూరల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో గుండెలపై ఆయన చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకుని అపూర్వ స్వాగతం పలికాడు.
ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ 23వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బానోత్ అనిల్ కేటీఆర్‌కు పెద్ద అభిమాని. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ ప్రోగ్రామ్ ఉందంటే కచ్చితంగా దానికి హాజరవుతుంటాడు. ఆ మీటింగ్‌లు కేటీఆర్‌ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి సంతోషపడుతుంటాడు. అయితే ఈసారి కేటీఆర్‌కు వినూత్నంగా స్వాగతం పలకాలని భావించిన అనిల్ తన గుండెలపై కేటీఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాడు.