Harish Shankar | ఇటీవలే రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హరీష్ శంకర్ (Harish Shankar). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. హరీష్ శంకర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సెషన్లో త్రివిక్రమ్ (Trivikram Srinivas)తో సమస్యల గురించి ఓ నెటిజన్ను హరీష్ శంకర్‌ను ప్రశ్నించాడు.
దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. మంచి ప్రశ్న ఇది. ఈ టాపిక్ నా దృష్టికి వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే కంటే ముందే త్రివిక్రమ్ 2-3 నంది అవార్డులను అందుకున్నారు. నాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన నాకు సీనియర్. ఈ విషయాన్ని నేనెక్కడా బయట పెట్టలేదు. మా నాన్న త్రివిక్రమ్‌కు వీరాభిమాని. ఆయన అతడు సినిమాను వందల సార్లు చూశారు.
మా ఇంట్లో త్రివిక్రమ్ పెద్ద కొడుకు లాంటి వారు. ఒకవేళ నా సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువుంటే.. త్రివిక్రమ్ సినిమాలు చూడాలని నాన్న సలహా ఇస్తారు. త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ కొన్ని సార్లు నాకు చిరాకు (నవ్వుతూ) తెప్పిస్తుంది. నా సినిమాలను త్రివిక్రమ్ నాన్నకు చూపించాలనుకుంటుంటా. ఆయన నా అభిమాని కావాలనుకున్నా.. అందుకే నాన్న నాకు సలహాలివ్వడం మానేశారంటూ చెప్పుకొచ్చాడు.
Priyadarshi | ప్రియదర్శి నెక్ట్స్ సినిమా టైటిల్‌పై సమ్మోహనం మేకర్స్ క్లారిటీ
Stree 2 | 4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న శ్రద్దాకపూర్ స్త్రీ 2
World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్