Tollywood Producers : సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ‘మన శంకరవరప్రసాద్’, ‘రాజా సాబ్’ చిత్రాల ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారు ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ అప్పీల్ చేశారు.
సింగిల్ జడ్డి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, టికెట్ ధర పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని రాజా సాబ్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్.. మన శంకర వరప్రసాద్ నిర్మాతలు సుష్మిత కొణిదెల, సాహు గరపాటిలు అభ్యర్థించారు. తమ అప్పీల్‌ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరారు. నిర్మాతల అప్పీల్‌పై బుధవారం హైకోర్టు విచారించనుంది.
The trailer of Mana Shankara Vara Prasad Garu drops on January 4th ❤️🔥
Grand theatrical release arrives on January 12th 🔥 pic.twitter.com/AGKbAPfb9f
— let’s x Cinematica (@letsxCinematica) January 2, 2026
నిరుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావివూడి (Anil Ravipudi) ఈసారి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నయనతార(Nayanatara) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఇక పాన్ ఇండియా హీరోగా ఇప్పటికే నిరూపించుకున్న రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas)తో ఫాంటసీ హర్రర్ కామెడీ సినిమాగా రాజా సాబ్‌ను తెరకెక్కించారు మారుతి. మాళవికా మోహనన్, నిధి అగ్వాల్, రిద్ది కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Every tale has a king, but some kings carry secrets darker than time itself.#TheRajaSaab trailer is here, where love collides with fear, and destiny rewrites itself.
This Sankranti, Jan 9th, 2026… the legend begins. pic.twitter.com/ko8phO4pNx— Sanjay Dutt (@duttsanjay) September 29, 2025