SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
SDGM | గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్డీజీఎం (SDGM)గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇటీవలే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
SDGM | క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేశాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్డీజీఎం (SDGM)గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా మరో బీటౌన్ స్టార్ యాక్టర్ ఈ మూవీలో జాయిన్ అయ్యాడు. రణ్‌దీప్ హుడాకు టీంలోకి స్వాగతం పలుకుతూ ఓ స్టైలిష్ లుక్‌ను షేర్ చేశారు మేకర్స్. యాక్షన్ ఫీస్ట్‌లో భాగమవుతున్నందుకు ఎక్జయిటింగ్‌గా ఉంది. సన్నీడియోల్ అండ్ టీంతో సెట్స్‌లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతానోనని ఎదురుచూస్తున్నా. మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇది మాస్ ఫీస్ట్‌గా ఉండబోతుంది.. అంటూ తన ఎక్జయిట్‌మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా మూవీ లవర్స్, ఫాలోవర్లతో పంచుకున్నాడు రణ్‌దీప్ హుడా.
ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ చిత్రం రవితేజ హీరోగా తెరకెక్కించిన క్రాక్ రీమేక్ అని వార్తలు రాగా.. SDGM రీమేక్ కాదని, సన్నీడియోల్‌ను మైండ్‌లో పెట్టుకొని రాసుకున్న కొత్త కథ అని గోపీచంద్ మలినేని క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే.
రణ్‌దీప్ హుడా స్టైలిష్ లుక్..
Excited to be a part of this action feast – #SDGM ❤️🔥
Cannot wait to get on sets with @iamsunnydeol Paaji and the entire team.
As promised, this will be a MASS FEAST 💥💥
Starring Action Superstar @iamsunnydeol 💪🏻
Directed by @megopichand 💥
Produced by @MythriOfficial &… pic.twitter.com/T9liDlv6aX— Randeep Hooda (@RandeepHooda) August 20, 2024
Read Also :
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Saripodhaa Sanivaaram | నాని ఆ ఇద్దరు డైరెక్టర్లను మోటివేట్ చేశాడట.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

