Actress | సీనియర్ నటి సుధా చంద్రన్‌కు సంబంధించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేవీ భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె భక్తి పారవశ్యంలో పూర్తిగా లీనమై భావోద్వేగంగా స్పందించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక వస్త్రధారణతో దర్శనమిచ్చిన సుధా చంద్రన్.. నుదుటిపై ‘జై మాతాజీ’ అని రాసి ఉన్న బ్యాండ్‌తో భజనలో పాల్గొన్నారు. పాటలు, మంత్రోచ్ఛారణల మధ్య ఆమె ఒక్కసారిగా తీవ్ర భావావేశానికి లోనవుతూ ఉత్సాహంగా కదలడం కనిపించింది. ఆ క్షణాల్లో ఆమె తన చుట్టూ ఉన్నవారిని గమనించలేనంతగా ట్రాన్స్‌లోకి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడున్న భక్తులు ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి వల్ల జరిగిన సహజ స్పందనగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఆమె ఆరోగ్యం, మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పరాకాష్టకు చేరుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సహజమేనని, దానిని అనవసరంగా విమర్శించకూడదని మరో వర్గం అభిప్రాయపడుతోంది.సుధా చంద్రన్ గురించి చెప్పాలంటే.. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్‌గా మాత్రమే కాకుండా, నటిగా కూడా తనదైన గుర్తింపు సంపాదించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన తర్వాత కూడా కృత్రిమ కాలితో నృత్యం చేసి ఎందరికో ప్రేరణగా నిలిచారు.
ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘మయూరి’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అనంతరం తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అనేక చిత్రాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ప్రత్యేకంగా హిందీ టీవీ సీరియల్ ‘నాగిన్’లో యామిని రహేజా పాత్రతో ఆమె విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, సీరియళ్లతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ, తన విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఉండడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
A video of actress Sudha Chandran is going viral on social media, showing her completely immersed in devotion during Mata Ki Chowki. The video shows people around her trying to support her as she becomes emotional.
1/2#SudhaChandran #MataKiChowki pic.twitter.com/rGZPiSpwT6— Siraj Noorani (@sirajnoorani) January 4, 2026