Donald Trump | నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు.. ప్రశంసిస్తూనే టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించిన ట్రంప్!
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో చేపట్టబోయే చర్యల గురించి చెబుతున్న వేళ ట్రంప్ భారత్ గురించి కూడా ప్రస్తావించారు.
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించిందని.. తనను సంతోషపెట్టేందుకే భారత ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ” వాళ్లు నన్ను సంతోషపెట్టాలని భావించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. రష్యాతో వారు వ్యాపారం కొనసాగిస్తేం.. మనం చాలా వేగంగా టారిఫ్‌లు పెంచుతాం“ అని ట్రంప్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ఆడియా క్లిప్‌ను వైట్ హౌస్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో వెల్లడించింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ అయితే మరింత దయనీయంగా ఉందన్నారు. తాను చూసిన వాటిలో అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ వెనెజువెలాదే అని పేర్కొన్నారు. కాగా, భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే గతంలోనూ రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తామని ప్రధాని మోదీ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
#WATCH | On India’s Russian oil imports, US President Donald J Trump says, “… They wanted to make me happy, basically… PM Modi’s a very good man. He’s a good guy. He knew I was not happy. It was important to make me happy. They do trade, and we can raise tariffs on them very… pic.twitter.com/OxOoj69sx3
— ANI (@ANI) January 5, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

