They Call Him OG | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) ప్రస్తుతం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నాని అండ్ టీం.
సరిపోదా శనివారం ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత డీవీవీ దానయ్యకు ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు నాని. ఇంతకీ పవన్‌కల్యాణ్ ఓజీ అప్డేట్ ఎప్పుడు అని నాని అడిగిన ప్రశ్నకు డీవీవీ దానయ్య బదులిస్తూ.. అతి త్వరలో.. షూటింగ్ వీలైనంత తొందరగా మొదలవుతుందని చెప్పారు. ఓజీ చివరి దశ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నామన్నారు. ఈ కామెంట్స్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు, మూవీ లవర్స్. నాని ఆఫ్‌లైన్‌లో అడిగిన ఈ ప్రశ్నకు స్టేజ్‌పై సమాధానమిచ్చి అభిమానుల్లో నెలకొన్న డైలామాకు చెక్ పెట్టారు స్టార్ ప్రొడ్యూసర్.
ఇక సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన స్టిల్స్‌లో.. ఆఫీసులో నాని.. డ్యూటీ (కానిస్టేబుల్)లో ప్రియాంకా మోహన్ చాట్‌లో ఉన్నారు. సూర్య : హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే.. చారు : హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4:05 ? అని పెట్టగా.. చారు 4:05 ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకునే స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Hero @NameisNani asked producer Danayya garu for the OG update.
It’s coming soon, we are resuming the shoot as soon as possible, answered Danayya gaaru. #TheyCallHimOG pic.twitter.com/ISYjUzcCO5
— Satya (@YoursSatya) August 21, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!