Seetha Payanam | తెలుగు, కన్నడతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ (Arjun).ఈ యాక్షన్ కింగ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా సీతా పయనం (Seetha Payanam). అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ నిరంజన్ సుధింద్ర లీడ్ రోల్లో నటిస్తుండగా.. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీ నుంచి మేకర్స్ అసలు సినిమా ట్రాక్‌ను విడుదల చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అంటూ సాగుతున్న ఈ పాటను చంద్రబోస్ రాయగా.. పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడింది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు. ఈ మూవీలో అర్జున్ కీ రోల్లో కనిపించడమే కాకుండా.. స్టంట్ సీన్లకు స్వయంగా కొరియోగ్రఫీ అందించడం విశేషం. కన్నడ యాక్టర్ ధ్రువ్ సార్జా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
సీతా పయనంలో నిరంజన్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సీతా పయనం వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.