Couple Friendly | టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్బ్యానర్పై తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ అప్డేట్ అందిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు.
ఈ మూవీని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. సన్‌లైట్‌లో హీరోహీరోయిన్లు రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు పీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్ మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది. టీజర్లో నెల్లూరు కుర్రాడైన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ, సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు.
ఖర్చుల కోసం బైక్ పూలింగ్(రాపిడో లాంటివి) చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి (మానస వారణాసి) అతని బైక్‌లో ప్రయాణిస్తుంది. అలా అనుకోకుండా కలిసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత ఎలా ప్రేమలో పడతారు..? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది.
This Valentine’s Day, fall in love with their love 🫶#CoupleFriendly in cinemas worldwide on FEBRUARY 14th ❤️@santoshsoban @varanasi_manasa @manojac #AjayKumarRaju @DKP_DOP @sanjheg @ramjowrites @thecutsmaker #Micheal_ArtDirector @dineshmoffl @gopiprasannaa #PrasathColorist… pic.twitter.com/bCivLgvTpn
— BA Raju’s Team (@baraju_SuperHit) January 7, 2026
Sakshi Vaidya | ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆఫర్ .. తప్పుకున్న విషయం పై క్లారిటీ ఇచ్చిన సాక్షి వైద్య
Mokshagna | నందమూరి నెక్స్ట్ జనరేషన్ రెడీనా … మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కొత్త ఊహాగానాలు
Anasuya | అనసూయ ఎవరికి క్లాస్ పీకింది.. మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కామెంట్స్