Maha Shivratri | శివుడిని ఎలా అభిషేకించాలి? పాలతో పూజిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? నెయ్యితోనా?
Maha Shivratri | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి.
Maha Shivratri | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే ‘ఈ సంపదలన్నీ నువ్వు ఇచ్చినవే స్వామీ!’ అని కృతజ్ఞత ప్రకటించడమే ఆ ద్రవ్యాలతో శివుణ్ని అభిషేకించడంలోని ఆంతర్యం. వీటిలో ఎక్కువ తక్కువలు లేవు. ఈ తర తమ భేదాలన్నీ మనం కల్పించుకున్నవే. మన దృష్టిలోనే ఈ ఎక్కువ తక్కువలు. శివుడి సృష్టిలో అన్నీ సమానమే. అతడు చూసేది మన అంతరంగంలోని నిశ్చల భక్తిని మాత్రమే.
‘శాంతి ధారా జలంబుల జలక మార్చి’ అన్నాడు శ్రీనాథ మహాకవి. అంటే, జ్ఞాన దీపం వెలుగుతూ ఉండగా, శాంతి ధారలతో అభిషేకించాలి. ‘మనసులో జ్ఞాన దీపం వెలిగితే, ఎక్కువ తక్కువలు ఉండవు. స్వ పర భేదాలు కూడా ఉండవు. రాగద్వేషాలకూ, అహంకార మమకారాలకూ అతీతమైన ఒక ప్రశాంతత హృదయంలో నెలకొని ఉంటుంది. ఈ ప్రశాంతతే శివాభిషేకానికి తగిన శ్రేష్ఠమైన పదార్థం. ప్రపంచమంతా శివమయం అని, అందరూ తనవారేనని, తానేనని, సృష్టి అంతా ఒక్కటేననీ పవిత్ర భావాలను శివుడికి పూజా పుష్పాలుగా సమర్పించే ప్రయత్నం చేయాలి. పూజలో మనం సమర్పించే పూలు స్వచ్ఛంగా, పరిమళ భరితంగా, పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా! ఆ పూలు మన భావాలే అయినప్పుడు ఆ మనసు నిష్కల్మషంగా, పవిత్రభావ పరిమళాలతో నిండి ఉండాలి. అలాంటి దీపారాధన, అభిషేకం, అర్చన జరుగుతూ ఉంటే, ‘అతి విశుద్ధ మనోవృత్తి’ సిద్ధిస్తుంది. ఈ స్థితిని అనుభవానికి తెచ్చుకోవటానికి మనం చేసే దీపారాధన, అభిషేకం, పుష్పార్చన దోహదం కావాలన్నదే శ్రీనాథ కవి ఆశయం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

