తిరుమల : ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 82,337 మంది భక్తులు దర్శించుకోగా 30,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.58 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.