2026 Sankranthi heroines | సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకమని తెలిసిందే. యేటా న్యూ ఇయర్ సందర్భంగా మొదటి (జనవరి) నెలలో వచ్చే సంక్రాంతి సినిమాలపై బిబినెస్ బాగా జరుగుతుంది. ఈ సీజన్లో హిట్టు కొట్టిన యాక్టర్లు సంవత్సరమంతా నయా జోష్‌తో సినిమాలు చేస్తూ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా హీరోలు సిల్వర్ స్రీన్‌పై కనిపిస్తుంటారు.
అయితే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం ఈ టాపిక్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా హిట్టయితే హీరోయిన్లకు వరుస అవకాశాలు రావడం సహజమే.. కానీ సినిమా ఫ్లాపైతే మాత్రం మళ్లీ ఛాన్స్ వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ప్రత్యేకించి సంక్రాంతి బరిలో నిలిచి హిట్టు కొట్టిన హీరోయిన్లు ఏడాదంతా మంచి హుషారుతో సినిమాలు చేసే మరి ఈ సంక్రాంతికి లక్‌ను పరీక్షించుకోబోతున్న పాత, కొత్త హీరోయిన్లపై ఓ లుక్కేస్తే..
నయనతార :
ఒకానొక టైంలో తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్నలేడీ సూపర్ స్టార్ నయనతారకు కొంతకాలంగా సరైన హిట్స్ లేవనే విషయం తెలిసిందే. చివరగా చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాలో మెరిసిన ఈ అమ్మడు మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీ హిట్టయితే మాత్రం నయనతారకు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆషికా రంగనాథ్ :
అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ ఆషికా రంగనాథ్. నాగార్జునతో కలిసి నటించిన నా సామి రంగ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌కు తన లక్‌ను పరీక్షించుకునేందుకు రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సక్సెస్ అయితే ఆషికా రంగనాథ్ 2026లో తన కెరీర్‌ను మరింత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
డింపుల్ హయతి :
ఈ భామ కెరీర్లో ఆరు సినిమాలు చేసినా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్టు కూడా పడలేదు. ఎలాగైన మంచి బ్రేక్ అందుకోవాలని చూస్తున్న డింపుల్ హయతికి రవితేజతో కలిసి నటిస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి సీజన్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
మీనాక్షి చౌదరి :
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్టందుకుంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా హిట్టయితే మీనాక్షి చౌదరి మార్కెట్ వాల్యూ మరింత పెరగడం ఖాయమైనట్టే.
సంయుక్తా మీనన్ :
2025లో అఖండ 2 సినిమాతో సక్సెస్ అందుకుంది సంయుక్తా మీనన్. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే సంయుక్తా మీనన్‌కు ఈ ఏడాదికి కావాల్సిన బూస్ట్ అందినట్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాక్షి వైద్య :
ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలతో టాలీవుడ్ జర్నీ మొదలుపెట్టింది సాక్ష వైద్య. అయితే ఈ రెండు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న నారి నారి నడుమ మురారిలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో మెరువనుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం సాక్షి వైద్యకు హిట్టు ఇస్తుందా..లేదా అనేది చూడాలి.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?