ఢిల్లీ : భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ వీక్షణల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని ఐసీసీ చైర్మన్ జై షా హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సూపర్-8 దశ ముగిసేసరికే 60 కోట్ల మంది ప్రపంచకప్‌ను చూశారని బుధవారం ఎక్స్ ద్వారా ప్రకటించాడు. ‘టీ20 ప్రపంచకప్‌ను అత్యంత ప్రేక్షకాదారణ పొందిన ఈవెంట్‌గా మార్చాలని ప్రారంభించాం.
అందుకు తగ్గట్టుగానే భారత్‌లో ఈ టోర్నీని చూసినవారి సంఖ్య 500 మిలియన్లు (50 కోట్లు) దాటింది. జియో హాట్‌స్టార్‌లో మొత్తంగా ప్రపంచకప్‌ను వీక్షించిన వారి సంఖ్య 60.5 మిలియన్లు (6 కోట్లు) దాటింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధికం. సెమీస్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా ముందున్న వేళ వ్యూస్ విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.