Maharaja | ఈ ఏడాది మహారాజ (Maharaja) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన మహారాజ జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మహారాజ 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా జులై 12న డిజిటల్ డెబ్యూ ఇచ్చింది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. తాజాగా మరో అరుదైన ఫీట్ ఖాతాలో వేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ ఎక్కువ వ్యూస్ (18.6 మిలియన్ వ్యూస్) సాధించిన ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది. మహారాజ హిందీ చిత్రాలు Crew (17.9 మిలియన్ వ్యూస్) & LaapataaLadies (17.1 మిలియన్ వ్యూస్)ను అధిగమించి మరీ ఈ రికార్డును నెలకొల్పడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ అన్ని వెర్షన్లలో రికార్డ్స్ సృష్టిస్తూ ఇండియాలో మొదటి నుంచి నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది.
ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, సచనా నిమిదాస్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
#Maharaja is now the most viewed Indian film on Netflix this year with 18.6M views so far beating #Crew (17.9M) & #LaapataaLadies (17.1M) in 2024 https://t.co/jcGfheTNAC pic.twitter.com/MI2ygO0ZFg
— At Theatres (@AtTheatres) August 21, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!