Nani | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ యాక్టింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షి (Arshad Warsi). తనకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని.. అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడన్న అర్షద్ వర్షి.. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ కామెంట్ చేయడంతో నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheerbabu) స్పందిస్తూ.. ఇలాంటి చిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యల కంటే ప్రభాస్‌కున్న స్థాయి చాలా ముఖ్యమైనదని అర్షద్ వర్షిపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా ఇప్పుడు సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ కామెంట్స్‌పై స్పందించాడు. అర్షద్ వర్షి తన సినిమా కెరీర్ మొత్తంలో అందులోలేని పాపులారిటీ ఒక్క ప్రభాస్‌పై చేసిన కామెంట్స్‌తో పొందాడని అన్నాడు నాని.
ఓ యూట్యూబర్ చేసిన చిట్‌చాట్‌లో అర్షద్ వర్షి మాట్లాడుతూ.. కల్కి సినిమా తనకు నచ్చలేదని.. అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడని.. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడని అన్నాడు. అంతేకాకుండా బిగ్బీకున్న శక్తిలో తనకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుందని.. అతడు అసాధారణమైన వ్యక్తి అని అన్నాడు. అయితే బిగ్ బీ ముందు ప్రభాస్ జోకర్లా కనిపిస్తాడంటూ కామెంట్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు.
“The actor #ArshadWarsi who commented on #Prabhas garu has gained more publicity and popularity now than he ever did throughout his entire acting career.” 🤣
~ Actor @NameisNani pic.twitter.com/gfr6mh3Vwd
— Hail Prabhas (@HailPrabhas007) August 21, 2024
Coolie | పోర్ట్ సిటీలో రజినీకాంత్ కూలీ షూట్.. తాజా షెడ్యూల్ వివరాలివే..!
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్
Mahesh Babu | ముఫాసా: ది లయన్ కింగ్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. ఇంతకీ ఏ పాత్రకో తెలుసా..?