GOAT Movie | మార్చి 26న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న సుడిగాలి సుధీర్ G.O.A.T
GOAT Movie | ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక.
GOAT Movie | ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) Greatest Of All Times అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 26న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ప్రస్తుతం గోట్ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలువబోతుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుందని. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత అన్నారు.
సుడిగాలి సుధీర్, దివ్యభారతి, సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ, డీఓపీ: రసూల్ ఎల్లోర్, ఆడిషనల్ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, , కో ప్రొడ్యూసర్: సమైరా రెడ్డి.ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ, దర్శకత్వం: వేదవ్యాస్, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ళ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

