Raayan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యాక్టర్‌గా ఇప్పటికే కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ధనుష్.. రాయన్‌తో డైరెక్టర్‌గా కూడా తానేంటో నిరూపించుకున్నాడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాయన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా రాయన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ధనుష్‌కు నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అభినందనలు తెలియజేశారు. రాయన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతోపాటు హీరో కమ్ డైరెక్టర్‌గా విక్టరీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కళానిధి మారన్ ధనుష్‌కు రెమ్యునరేషన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కళానిధి మారన్ ధనుష్‌కు హీరోగా, డైరెక్టర్‌గా రెండు చెక్కులు అందజేయడం విశేషం.
సాధారణంగా హీరోలు, దర్శకులు లాభనష్టాలతో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకున్న తర్వాత నిర్మాతల నుంచి పే చెక్ అందుకుంటారు. కానీ ధనుష్ మాత్రం అలా కాకుండా ఓవైపు డైరెక్టర్‌గా.. మరోవైపు హీరోగా సినిమాను తన భుజస్కందాలపై మోసుకెళ్లడమే కాదు.. విడుదలై భారీ వసూళ్లు సాధించిన తర్వాత నిర్మాత నుంచి చెక్కు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.
డీ50వ (D50)గా తెరకెక్కిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్, ఎస్జే సూర్య , కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Mr. Kalanithi Maran congratulated @dhanushkraja for the grand success of #Raayan and presented 2 cheques to him – one for the hero and one for the director. pic.twitter.com/gp12Z8s6bl
— Sun Pictures (@sunpictures) August 22, 2024
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని