Megha Akash | నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మేఘా ఆకాశ్ (Megha Akash). ఈ భామ ఇటీవలే విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (తెలుగులో) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న మేఘా ఆకాశ్ మరోవైపు వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేసింది. ఈ బ్యూటీ ఇటీవలే తన ప్రియుడు సాయి విష్ణు (Saai Vishnu)తో నిశ్చితార్థం (engagement )పూర్తి చేసుకుంది.
మేఘా ఆకాశ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫొటోలు షేర్ చేసింది. ఈ ప్రైవేట్ సెర్మనీకీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మేఘా ఆకాశ్-సాయి విష్ణు ఆరేండ్లుగా ప్రేమలో ఉన్నారు. ఫైనల్ గా లవ్ లైఫ్ నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. మేఘా ఆకాశ్-సాయి విష్ణు ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఈ ఇద్దరి వెడ్డింగ్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉండగా.. కుటుంబసభ్యులు త్వరలోనే పెళ్లి తేదీపై స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. మేఘా ఆకాశ్ ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం సినిమాల్లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా..? లేదా.,? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఎంగేజ్మెంట్ స్టిల్స్..
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని