Priyadarshi | టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రూపా కొడువయూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) టైటిల్‌తో వస్తోంది. ప్రియదర్శికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా సెట్స్‌లో ప్రియదర్శి పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది టీం. ఈ సందర్భంగా మోహన కృష్ణ టీం ప్రియదర్శితో బర్త్ డే కేక్ చేయించారు. దీనికి సంబంధించి స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిపూర్ణ హాస్యరస కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే తెలియజేశారు మేకర్స్.
బలగం, ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి సక్సెస్‌లను అందుకుకున్న ప్రియదర్శి ఇటీవలే విడుదలైన డార్లింగ్ మాత్రం ఫెయిల్యూర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన రూపా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తోంది. సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్లో ఓ బుడ్డోడు ఆకాశంపైకి వేలు చూపిస్తున్న స్టిల్‌లో తారలు దిగివచ్చిన వేళ అని రాసి ఉండగా.. రింగ్స్, గాగుల్స్, బైక్ తాళపు చెవులు, బూతద్దం, క్యాలెండర్‌ను చూడొచ్చు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 15వ సినిమా ఇది.
Birthday celebrations of SARANGAPANI aka @PriyadarshiPN on the sets of #SarangapaniJathakam 🤩🥳 #HBDPriyadarshi 💐 pic.twitter.com/OwqTJQqFqM
— BA Raju’s Team (@baraju_SuperHit) August 26, 2024
Arjun Reddy | అర్జున్ రెడ్డి @ ఏడేండ్లు.. సందీప్ రెడ్డి వంగాకు విజయ్ దేవరకొండ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..?
Megha Akash | రజినీకాంత్‌ను కలిసిన మేఘా ఆకాశ్-సాయి విష్ణు.. స్పెషల్ ఇదే