Megha Akash | నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మేఘా ఆకాశ్ (Megha Akash) ఇటీవలే తన ప్రియుడు సాయి విష్ణు (Saai Vishnu)తో నిశ్చితార్థం (engagement )పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ షేర్ చేసిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మేఘా ఆకాశ్-సాయి విష్ణు రీసెంట్గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తమ పెండ్లికి రావాల్సిందిగా కోరుతూ తలైవాకు ఆహ్వానం అందజేశారు. ఆరేండ్లుగా ప్రేమలో ఉన్న మేఘా ఆకాశ్-సాయి విష్ణు.. లవ్ లైఫ్ నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుండటంతో కోస్టార్లు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు, ఫాలోవర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేఘా ఆకాశ్ ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం సినిమాల్లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా..? లేదా,? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
Actress @akash_megha and her fiance #SaaiVishnu (Son of Congress Ex-MP Thirunavukkarasar) invited #Superstar @rajinikanth for their wedding.. pic.twitter.com/cMd2zHeEYS
— Ramesh Bala (@rameshlaus) August 25, 2024
Karthikeya 2 | సెలబ్రేషన్స్‌లో నిఖిల్ కార్తికేయ 2 టీం.. హాజరైన ఇండస్ట్రీ ప్రముఖులు
35 Chinna Katha Kaadu | నివేదా థామస్ 35 చిన్న కథ కాదు థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్..!
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు