35 Chinna Katha Kaadu | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ చిత్రం 35- చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). ప్రియదర్శి, విశ్వదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీలో నివేదా థామస్ సరస్వతి పాత్రలో నటిస్తోంది. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే సరస్వతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేయగా.. నివేదా థామస్ సంప్రదాయక చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడే గృహిణిగా కనిపిస్తోంది. విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే పది.. 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తరు.. అంటూ టీజర్లో నివేదా థామస్ అడిగే చిలిపి ప్రశ్నతో మొదలవుతూ ఫన్నీ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామంలోని చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో రాబోతున్నట్టు టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Everything finds it’s time.
We did!In Theatres on September 6th,
OUR STORY begins ♥️35 – Chinna katha kaadu 😊#35Movie #35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads @RanaDaggubati #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/2HW0XQjEJ2
— Nivetha Thomas (@i_nivethathomas) August 25, 2024
Buddy Movie | ఓటీటీలోకి అల్లు శిరీష్ ‘బడ్డీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Kannappa | కన్నప్పలో మంచు విష్ణు కొడుకు.. అవ్రామ్ డెబ్యూ లుక్ రిలీజ్ టైం ఫిక్స్
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు