Vaibhav Suryavanshi : భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కెప్టెన్‌గా మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా అండర్-19 బౌలర్లను వణికిస్తూ విధ్వంసక అర్ధ శతకం(68) బాదాడీ కుర్రాడు. రెండో యూత్ వన్డే (Youth ODI)లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. 10 సిక్సర్లతో సఫారీ బౌలర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు అభిగ్యాన్ కుందు (48నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసిన టీమిండయా డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కొత్త ఏడాదిలోనూ వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో యూత్ వన్డే సిరీస్‌లో సారథిగా వ్యవహరిస్తున్న వైభవ్.. రెండో మ్యాచ్‌లో శివాలెత్తిపోయాడు. ప్రత్యర్ధి నిర్దేశించిన 246 పరుగుల ఛేదనలో ఈ లెఫ్ట్ హ్యాండర్ పూనకాలు వచ్చినట్టు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతులనే ఎదుర్కొన్న ఈ యంగ్ బ్యాటర్. 10 సిక్సర్లు, ఒక్క ఫోర్‌తో 68 రన్స్ బాదేశాడు.
WELL PLAYED VAIBHAV SURYAVANSHI..!! 👏
– Smashed 68(24) vs South Africa U19
– With 1 four and 10 sixes. 🤯pic.twitter.com/BoZ8ffqqa5— Sports Culture (@SportsCulture24) January 5, 2026
అతడు ఔటయ్యాక.. వేదాంత్ త్రివేది(31 నాటౌట్), అభిగ్యాన్ కుందు(48 నాటౌట్)లు అజేయంగా జట్టును గెలిపించారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 176గా నిర్దేశించగా.. 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తొలి వన్డేలోనూ డీఎల్ఎస్ పద్ధతిలోనే 19 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు యూత్ వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య చివరి మ్యాచ్ జనవరి 7న జరుగనుంది.