మంచు లక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లేచింది మహిళాలోకం’. అర్జున్-కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య చిన్న విషయాలకే విభేదాలు రావడం, వాటికి పక్కింటి వారు ఆజ్యం పోయడం, ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలతో ట్రైలర్ ఉత్కంఠను పంచుతూనే వినోదప్రధానంగా సాగింది.
సీరియస్ విషయాన్ని వినోదప్రధానంగా చెబితే చాలా మందికి అర్థమవుతుందని, ఈ సినిమా విషయంలో అదే ప్రయత్నం చేశామని, అందరినీ నవ్వించే చిత్రమిదని మంచు లక్ష్మి చెప్పింది. ఇప్పటివరకు సీరియస్ రోల్స్‌లో కనిపించిన తాను తొలిసారి కామెడీ పాత్ర చేశానని అనన్య నాగళ్ల తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శృతిరంజని, నిర్మాతలు: హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్, దర్శకత్వం: అర్జున్-కార్తీక్.