Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) లీడ్ రోల్లో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా శ్రీకృష్ణాష్ఠమి సందర్భంగా సోమవారం (ఆగస్టు 26) కన్నప్ప నుంచి ఆసక్తికర అప్డేట్ షేర్ చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రంతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. కృష్ణాష్ఠమి సందర్భంగా అవ్రామ్ లుక్ విడుదల చేనున్నారు మేకర్స్. ఇంతకీ అవ్రామ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటికే విడుదల చేసిన కన్నప్ప టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Mark your calendars#AvramManchu ‘s first look from #Kannappa🏹 will be out on Sri Krishna Janmashtami on August 26th#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal #PreityMukhundhan… pic.twitter.com/hsSBBG9bsl
— Ramesh Bala (@rameshlaus) August 23, 2024
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు