Shafali Verma : పునరాగమనంలో చితక్కొడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) మరోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో నిలిచింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో ఈ ఆవార్డు అందుకున్న లేడీ సెహ్వాగ్.. శ్రీలంకపై హ్యాట్రిక్ అర్ధ శతకాలతో డిసెంబర్ నెలకు నామినేట్ అయింది. మహిళల విభాగంలో లారా వొల్వార్డ్త్( Laura Wolvaardt), సునే లుస్(దక్షిణాఫ్రికా)లు ఈ అవార్డు కోసం ఇండియన్ స్టార్‌తో పోటీ పడుతున్నారు.
ఇటీవలే సొంతగడ్డపై శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసింది షఫాలీ వర్మ. ఐదు టీ20ల సిరీస్‌లో ఆకాశమే హద్దుగా ఆడిన షఫాలీ.. 181.20 స్ట్రయిక్ రేటుతో 241 పరుగులు సాధించింది. ఇక వరల్డ్‌కప్ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో వరుస శతకాలు బాదిన లారా వొర్వార్డ్త్ నామినేట్ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో సఫారీ సారథి 205.35 స్ట్రయిక్ రేటుతో 255 పరుగులు చేసింది. ఇక ఆ జట్టుకే చెందిన ఆల్‌రౌండర్ సునే లుస్ 205 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో నిలిచింది.
🚨 BREAKING 🚨
Laura Wolvaardt, Shafali Verma, and Sune Luus have been nominated for the ICC Women’s Player of the Month for December. 🥇#Cricket #ICC #Womens pic.twitter.com/AXiTNmQBMp
— Sportskeeda (@Sportskeeda) January 8, 2026
పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ పోటీ పడుతున్నారు. యాషెస్ సిరీస్‌లో నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు స్టార్క్. బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ రెండు అర్ధ శతకాలు బాదిన మిస్సైల్ స్టార్క్ 31 వికెట్లతో పోటీలోకి వచ్చాడు. కివీస్‌పై డబుల్ సెంచరీతో సత్తా చాటిన గ్రీవ్స్ నామినేషన్ దక్కించుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్లను వణికించిన డఫ్ఫీ 23 వికెట్లతో అదరగొట్టాడు. రెండు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన అతడి రేసులోకి వచ్చాడు.
35-year-old Mitchell Starc owned this Ashes series 💫
💪 Played all 5 Tests on the bounce
🏆 2 POTM awards
🎯 31 Wickets
🌟 2 Fifties with the bat
🏅 Player of the Series#AUSvENG pic.twitter.com/0DGnPPeWuv— Sport360° (@Sport360) January 8, 2026