T20 Cricket | హనుమకొండ చౌరస్తా, జనవరి 8 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో గ్రామీణ జిల్లాలోని క్రికెటర్లను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో నిర్వహిస్తున్న కాక వెంకటస్వామి మెమోరియల్ అంతర్ జిల్లాల టీ-20 ఫేజ్ 2 పోటీలు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలు, అంతర్ జిల్లాల టీ-20 పోటీల్లో భాగంగా నేటి నుంచి 10 తేదీ వరకు జరిగే పోటీలకు వేదికైన వరంగల్ జిల్లాలో జరిగే పోటీలను వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో హెచ్‌సీఏ ఇంచార్జి కార్యదర్శి బస్వరాజు, హెచ్‌సీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ చాంద్ జైన్ ముఖ్యఅతిథిగా పాల్గొని.. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు.
కాగా ఈ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు బ్యాటింగ్ చేసి 88 పరుగులు చెయ్యగా 89 పరుగులు సాధించి ఆదిలాబాద్ విజేతగా నిలిచిందని,ఆదిలాబాద్ జట్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అశ్విక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కిందని వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చాగంటి శ్రీనివాస్ తెలిపారు. మరో మ్యాచ్ హనుమకొండలోని టివివిస్ సుకాంత్ క్రికెట్ గ్రౌండ్లో జరగగా, హైద్రాబాద్ జట్టు రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా రంగారెడ్డి జట్టు 161 పరుగులకే ఆలౌటైంది, హైదరాబాద్ జట్టులో 62 పరుగులు సాధించిన వాసుదేవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, మహబూబ్‌నగర్ కార్యదర్శి రాజశేఖర్, ఆదిలాబాద్ కోచ్ ప్రదీప్ నిజామాబాద్ సంయుక్త కార్యదర్శి సురేష్, వరంగల్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఉపేందర్, ఉపాధ్యక్షుడు రఘుచ రాము, వేణు పాల్గొన్నారు.

Tirupati Express | తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్‌కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు